తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 31):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ బల్మూరు మండలం జిన్ కుంట గేట్ సమీపంలో గల శ్రీ కనకాల మైసమ్మను ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు శ్రీ కనకాల మైసమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ నాగర్కర్నూల్ జిల్లా పార్లమెంటు స్థానంను బి ఆర్ ఎస్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.