Wednesday , July 24 2024

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.

నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 22):

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తూ తీసుకెళ్లాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు అన్నారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం అమంగల్ పట్టణ కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం నిర్వహించిన జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి ఆధ్వర్యంలో నిర్వహించిన కల్వకుర్తి నియోజకవర్గం బిజెపి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృధి ప్రజల్లోకి వెళ్లాలన్నారు.కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ ఇవ్వడం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నేషనల్ హైవేలు వేయడం
కిసాన్ సమృద్ధి యోజన పథకం,సుకన్య యోజన పథకం,వంట గ్యాస్ పై వంద రూపాయలు తగ్గించడం, మెడికల్ కాలేజీలు
రామ మందిర నిర్మాణం,
గుడిలో,గోపురాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఉన్నాయని,ఈ పథకాలు అన్నిప్రతి ఇంటింటికి వెళ్లివివరించాలన్నారు.కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్షన్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన వెంటనే పార్లమెంట్ ఎలక్షన్లు రావడం అలానే భరత్ ప్రసాద్ పార్టీలో కలవడం టికెట్టు రావడంతో ఎంతో సంతోషంగా ఉందని అన్నారు, ఈసారి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసికట్టుగా పనిచేసి నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు.
అలానే ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం కైవసం చేసుకోవాలి బిజెపి కి వచ్చే 400 స్థానాలలో మొట్టమొదటి స్థానం నాగర్ కర్నూల్ స్థానం లో ఉండాలని అన్నారు.
భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎలక్షన్లో ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తాం అన్నారు. రామ మందిరం నిర్మాణం తర్వాత అయోధ్యకు రాముడొచ్చాడు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి మనకు ఒక రాముడు వచ్చాడు, ఆ రాముడు మన మీద ఉన్న నమ్మకంతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బరిలోకి భరతుని దింపాడని,రామ రాజ్యం లో ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం సుభిక్షంగా ఉండాలంటే మన ఈ భరతుని పార్లమెంటుకి పంపాలి నాగర్ కర్నూల్ అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ గారు మాట్లాడుతూ
నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో మొట్ట మొదట జరుగుతున్న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో జరగడం సంతోషంగా ఉందన్నారు.అలాగే ప్రధాని నరేంద్ర మోడీ నేను పార్టీలో బీజేపీ పార్టీలో చేరగానే నన్ను పిలిచి మొట్టమొదట నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ ఇవ్వడానికి కారణం భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని,కాబట్టి నా వంటి యువతను ప్రోత్సహించాలని టికెట్ ఇచ్చారన్నారు.నరేంద్ర మోడీ నా మీద పెట్టుకొని నమ్మకానికి మనమందరం కలిసికట్టుగా ఉండి ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని మోడీకి బహుమతిగా ఇద్దామన్నారు.ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ని ప్రధానమంత్రిని చేద్దాం అన్నారు.దేశ చరిత్రలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నిలిచిపోయేలా మెజారిటీ రావాలి అని అన్నారు.
అనంతరం ఎంపీ రాములు మాట్లాడుతూ ఈ విస్తృత స్థాయికి సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు నేను బిజెపి పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి ఇంత పెద్ద సభ కల్వకుర్తి నియోజకవర్గం లో జరగడం దానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది.ప్రపంచ చరిత్రలో భారతదేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకపోతున్న నరేంద్ర మోడీ వారు చేసేటువంటి నిస్వార్ధమైన సేవ చూసే బిజెపిలో చేరనన్నారు.
రాజకీయం అంటే ధనం సంపాదించడం కాదు ప్రజా బలం సంపాదించడం అన్నారు.
ఈ దేశానికి నిస్వార్ధంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని అదే విధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని మనం కైవసం చేసుకుని అంతే నిస్వార్ధంగా కేంద్రం నిధులనుంచి వచ్చే నిధులతో అభివృద్ధి చేసుకుందాం అన్నారు.అలానే పార్లమెంట్ ఎన్నికల్లో మనమందరం నరేంద్ర మోడీ వీర సైనికుల గా భరత్ ప్రసాద్ ని గెలిపించాలని, కల్వకుర్తి నియోజకవర్గం నుండి లక్ష ఓట్ల మెజారిటీ తీసుకురావాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ గారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వెంకటేష్, రంగారెడ్డి, జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మనీ నాయక్, కడ్తాల్ మండల బిజెపి అధ్యక్షులు, కడ్తాల్ మండల సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, కల్వకుర్తి టౌన్ బిజెపి అధ్యక్షులు నరసింహ, రహమతుల్లా బిజెపి మైనారిటీ మోర్చా అధ్యక్షులు, పలు మండలాల నాయకులు, బీజేవైఎం నాయకులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మోర్చా నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్లు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.