Saturday , October 5 2024

జిలుగు వెలుగుల విద్యుత్ కాంతుల్లో మన్నేవారిపల్లి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 22):

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి గ్రామం నుండి దేవుల తండకు పోయే దారి లోని చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన పెద్ద స్తంభాల 120 వాట్స్ విద్యుత్ లైట్లను శుక్రవారం జడ్పిటిసి మంత్రియా నాయక్ ప్రారంభించారు. మన ప్రాంత వాసి. మన అందరి ప్రియతమ నేత. సుపరిచితుడు. జనం మెచ్చిన నాయకుడు. నల్లమల ముద్దుబిడ్డ. అచ్చంపేట ఎమ్మెల్యే. నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు. వంశీకృష్ణ ఆదేశాలనుసారం. దీనికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ వైస్ చైర్మన్. మందడి. రాహుల్ రెడ్డి. నాయక్. గార్లకు ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞత అభివందనాలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో సభావత్. గురునాయక్. గిరిజన సేవా సంఘం అచ్చంపేట తాలూకా ప్రధాన కార్యదర్శి. ఆదివాసి గిరిజన అచ్చంపేట మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.