Friday , November 15 2024

విజయవంతంగా ముగిసిన ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (మార్చి 18):

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచవరం గ్రామంలో అనూష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మరియు శంకర్ నేత్రాలయం చెన్నై వారు సంయుక్తంగా ఈనెల 9 వ తేదీన మంత్రి సీతక్కతో ప్రారంభించి నాటి నుండి 18వ తేదీ సోమవారం వరకు దాదాపు 200 మందికి కంటి పొర ఆపరేషన్ చేసి విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు మాట్లాడుతూ ఇల్లు విడిచి దూర ప్రాంతాలకు పోయి వైద్యం తీసుకోలేక దినదినం వృద్ధాప్యంలో ఉన్న మాకు ఉచిత నేత్ర వైద్యం అందించి మన ప్రాంతం ముద్దుబిడ్డ మాచారం గ్రామస్తుడు అయిన అనూష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఎండపల్లి జలంధర్ రెడ్డి కి మరియు వారి కుటుంబ సభ్యులకు గ్రామస్తులు, కంటి ఆపరేషన్ చేయించుకున్న అవ్వ తాతలు, నల్లమల ముద్దుబిడ్డలు, కృతజ్ఞతలు తెలిపారు.