Wednesday , July 24 2024

ఎంపీటీసీలు ,సర్పంచ్లు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 18):

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నె వారి పల్లి ఎంపిటిసి చంద్రకళ రవీందర్, ఘన్ పుర్ ఎంపిటిసి హరిలాల్, ఆంజనేయులు తండా సర్పంచ్ నరసింహ, మోతిలాల్,మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యవహార శైలి నచ్చక బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా సోమవారం ఎమ్మెల్యే డా.చిక్కుడు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పుతూ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథం, మన్నె వారి పల్లి గ్రామ మాజీ సర్పంచ్ లాలు ,స్టేట్ స్పోర్ట్స్ సెల్ ప్రెసిడెంట్ రాహుల్ రెడ్డి, మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దశరథ్ నాయక్, మన్నె వారి పల్లి గ్రామ అధ్యక్షుడు రమేష్, ఎండి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.