Tuesday , July 16 2024

రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 18):

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీ లక్ష్మి చేన్నకేశవ దేవస్థానం రాయల గండి బ్రహ్మోత్సవాలు జాతర సందర్భంగా నిర్వహించే ఆటల పోటీ లను విజయవంతం చేయాలని రాయలగండి దేవస్థానం క్రీడా ఉత్సవాల కమిటీ చైర్మన్ అవుట్ యుగంధర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.నల్లమల అమ్రాబాద్ శ్రీ రాయల గండి లక్ష్మి చెన్నకేశవ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు లకు పనులు శరవేగంగా జరుగుతున్న సందర్భంగా అభివృద్ధి పనులు క్రీడల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పిఈటి లు చేవ్వ చక్రపాణి, చెవ్వ సూర్యనారాయణ, గడదాసు ఆంజనేయులు,లక్ష్మీనారాయణ, జైపాల్ , పాల్గొన్నారు.