Wednesday , July 24 2024

ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో మూడు సరిహద్దు చెక్పోస్టులు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేలకు మించి అమౌంట్ తీసుకు వెళ్ళకూడదు.

ఆర్డీవో మాధవి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (మార్చి 18):

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిందని ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలో మూడు ప్రదేశాల్లో సరిహద్దు చెప్పబోతున్న ఏర్పాటు చేశామని ప్రజలు తమ అవసరాల నిమిత్తం 50 వేల రూపాయలకు మించి ఎవరు తీసుకువెళ్లరాదని ఈనెల 17 నుంచి జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఆర్డీవో మాధవి తెలిపారు సోమవారం అచ్చంపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్ వద్ద ఒక సరిహద్దు చెక్పోస్టు అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో జేజే పాఠశాల వద్ద అమ్రాబాద్ మండలం మననూరు వద్ద శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామని తెలిపారు చెక్ పోస్ట్ ల వద్ద ఎస్ ఎస్ టి టి 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తారని అన్నారు. పోలింగ్ కేంద్రాలను రెండు కిలోమీటర్ల దూరం ఉన్న ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా మరో 74 కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 339 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు 74 పోలింగ్ కేంద్రాలలో ఉన్న 16 568 మంది ఓటర్లకు ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్లి పోలింగ్ స్లిప్పులను అందజేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు నియోజకవర్గంలో రెండు రోజుల 47,621 అందులో 1,24382 పురుషులు కాగా 1,2323 మహిళలు ఉన్నారని అందులో ట్రాన్స్ జెండర్స్ మరో ఐదు మంది ఉన్నారని వివరించారు. నియోజకవర్గంలో 76 సర్వసాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు గుర్తించమని అందుకు సంబంధించి శాఖ వారు తగిన భద్రత చర్యలు తీసుకుంటున్నారని అన్నారు మండలాల వారీగా ఉప్పునుంతల 12,అచ్చంపేట 18, లింగాల 6, వంగూరు 8, అమ్రాబాద్ 7, బల్మూర్ 3, చారకొండ 4, పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని అన్నారు. మొత్తం 44 రోడ్లలో రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని, త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారికి వివరిస్తామన్నారు. అందుకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పూర్తి సహకారం అందించాలని కోరారు.