Wednesday , September 18 2024

పది పరీక్షలు ప్రారంభం తొలి రోజు ప్రశాంతం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 18):

పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా 59పరీక్ష కేంద్రాల్లో తొలి రోజు తెలుగు ప్రథమ భాష పరీక్షకు 10532 విద్యార్థులకు గాను 10513 మంది విద్యార్థులు హాజరు కాగా 19మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి డాక్టర్ ఎం. గోవిందరాజులు తెలిపారు.
తొలి రోజు పరీక్షలకు విద్యార్థులు తల్లిదండ్రులతో, వారివారి బంధువులతో పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకున్నారు. జిల్లా కేంద్రం, బిజినపల్లి మండలంలోని పరీక్షా కేంద్రాలను డీఈవో సందర్శించారు.ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, జిల్లా వ్యాప్తంగా ప్లయింగ్‌ స్కాడ్స్‌ బృందాలు వివిధ మండలాలలోని 34 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.జిల్లాలో ఎక్కడ డిబార్‌కు కానీ, మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడలేదన్నారు.
జిల్లా వ్యాప్తంగా 99.8శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంతో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదన్నారు.
ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పరీక్ష కేంద్రాలకు 200 మీటర్లలోపు జిరాక్స్‌ కేంద్రాలను మూసివేశారు.
జిల్లాలో తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఆయన వెల్లడించారు.