Tuesday , July 16 2024

ట్రాస్మా జిల్లా ఉపధ్యక్షుడులు గా కొయ్యల శ్రీనివాసులు నియామకం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 17):

ప్రవేట్ స్కూల్ల యాజమాన్య అసోసియేషన్ నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులుగా శ్రీనివాసులుని రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ సమక్షంలో నియమించారు .గతంలో ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి, యాజమాన్య హక్కుల కోసం ఎంతో పోరాటం చేసిన కొయ్యల శ్రీనివాస్ కి తిరిగి జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించడం పై వివిధ యాజమాన్యాలు తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా లక్ష్మణ్ వ్యవహరించగా, నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, హాలరాజు ప్రధాన కార్యదర్శిగా, వెంకటేష్ కోశాధికారిగా నియామకం చేశారు , ఈ సందర్భంగా ట్రాస్మా జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కోయిల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల యాజమాన్య హక్కుల కోసం, వసతి కోసం పనిచేస్తానని అన్నారు.