Sunday , May 26 2024

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సన్మానించిన ఎస్సీ సంఘం నేతలు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 17):

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వం ప్రీతం ను నియమించడం పట్ల తమ హర్షం వ్యక్తం చేస్తూ నాగర్ కర్నూల్ ఆస్పరెంట్ మల్లేపల్లి జగన్ అచ్చంపేట మండలం చింతల రాజగోపాల్, బల్మూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం వెంకటయ్య ఆదివారం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ గా ఎన్నికైన ప్రీతం ను హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సి రాష్ట్ర చైర్మన్గా నియమితులైన ప్రీతం ఆధ్వర్యంలో నిరుపేదలైన ఎస్సీలకు కార్పొరేషన్ ద్వారా న్యాయం జరుగుతుందని తమ ఆశాభావం వ్యక్తం చేశారు.