Saturday , October 12 2024

సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు సిపిఎం పార్టీలో చేరిక.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 17)

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రాంతవాసి సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుండ మల్లేష్ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి వి. పర్వతాలు సమక్షంలో ఆదివారం సిపిఎం పార్టీలో
చేరారు.సిపిఎం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశము నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో బి.ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ నా మాతృ సంస్థ అయిన సిపిఎం పార్టీ 25 ఏళ్ల పాటు పనిచేసానని, కొంత విభేదాలతో కొన్ని రోజులు సిపిఐ పార్టీలో వెళ్లడం జరిగిందని, సిపిఐ పార్టీ జిల్లా నాయకుల పద్ధతులు నచ్చక, కమిటీ నిర్ణయాల మేరకు పనిచేయకుండా వ్యక్తిగత పనులను అమలు చేసే విధంగా కృషి చేయాలని ఉక్కుమ్ జారీ చేసే నిర్ణయాలు సరైనది కాదని అనేకసార్లు సిపిఐ జిల్లా నాయకులకు చెప్పిన వారి పద్ధతులను మార్చుకోకపోవడంతో వారితో విభేదించి తిరిగి నా మాతృ సంస్థలు చేరడం జరిగిందని వారు అన్నారు.