డిఇఓ గోవిందరాజులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (మార్చి 16):
పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎం గోవిందరాజులు తెలిపారు.
శనివారం నాగర్ కర్నూల్ పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లు ఆయన పరిశీలించారు.
పదో తరగతి పరీక్షలకు విధించిన నిభందనల గురించి వివరించారు ఆయన
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఈనెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనుండగా
జిల్లాలో 10,526 మంది విద్యార్థుల కోసం 59 కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఇందుకు జిల్లాలోని ప్రభుత్వ, గురుకుల, ప్రైవేట్ 303 పాఠశాలల్లోని 10,526 మంది విద్యార్థులు హాజరవుతారు.ఉదయం 9–30 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 11గంటల వరకే ఉంటాయి.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను వెల్లడించారు.
9–35గంటల వరకే అనుమతి:
పరీక్షలు ప్రతిరోజు 9–30గంటలకు ప్రారంభం కానుండగా 8–30గంటల నుంచి 9–35గంటల వరకు మాత్రమే అనుమతిస్తాం. ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు. పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయని.
పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ఫర్నీచర్, తాగునీరు, టాయిలెట్ల సౌకర్యం ఉంది. విద్యుత్ సౌకర్యం కూడా కల్పించి ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకున్నాం అని అన్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
విద్యార్థులకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశాం. 24గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటుండగా 7702775340 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలపొచ్చు. అయితే, సెంటర్లు ఏర్పాటుచేసిన కొన్ని పాఠశాలల పేర్లు ఒకే తరహాలో ఉన్నందున కేంద్రాలను ముందురోజే చూసుకుంటే ఇబ్బంది ఉండదని.పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా 59 కేంద్రాలకు అంతే సంఖ్యలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, సిట్టింగ్ స్క్వాడ్‌తో పాటుట 527మంది ఇన్విజిలేటర్లను నియమించాం.వీరికి తోడు ఐదు శాతం అదనపు సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని, అన్నారు.
నిఘా పటిష్టం
ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం అని.ప్రశ్నాపత్రాలను పటిష్టభద్రత వాహనాల్లో మాత్రమే తరలించేలా ఆదేశాలు జారీ చేశామని. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడమే కాక సమీపంలోని జిరాక్స్‌సెంటర్లను మూసివేయిస్తాం. వైద్యసిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని అన్నారు.
హాల్‌టికెట్లు ఇవ్వకుంటే చర్యలు
ఎస్సెస్సీ విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, ఇతర కారణాలతో యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను www.bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అని ఇక ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్యలు ఉంటాయి. ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది దీన్ని ప్రోత్సహించినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని అన్నారు.
పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతి లేదు ఎవరైనా అతిక్రమిస్తే శాశ్వతంగా ఉద్యోగాలు పోతాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.