Monday , September 16 2024

లోక్సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించండి.

కుటుంబ పార్టీలు దోచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాయి.

బి ఆర్ ఎస్ కాంగ్రెస్ తెలంగాణను నాశనం చేశాయి.

ఒక్క అవినీతిపరుడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు.

అవినీతిపై వ్యతిరేకంగా పోరాడేందుకు మీరంతా మద్దతు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (మార్చి 16):

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాగర్ కర్నూలు జిల్లాలో శనివారం బిజెపి నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి హోదాలో మొదటిసారిగా నాగర్ కర్నూల్ జిల్లాకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ కుటుంబ పార్టీలు దోచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాయని, కాంగ్రెస్ ,బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశాయని,కాంగ్రెస్ పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ భూదంద అక్రమాలకు పాల్పడుతున్నాయని అన్నారు. దేశంలో ఒక్క అవినీతిపరుడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదని అవినీతిపై వ్యతిరేకంగా పోరాడేందుకు మీరంతా మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు అంకెల స్థానాలను బిజెపి గెలుచుకుంటుందని జోషించారు రాష్ట్రపతిగా ఎంపిక చేస్తే ఆ పార్టీలు వ్యతిరేకించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దళిత నేతను అవమానించిందని, అది మీరు కల్లారా చూశారని అన్నారు. రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా యువకుడు భారత్ ప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో 400 స్థానాలు బిజెపి కైవసం చేసుకుంటుందని జోస్యం అని చెప్పారు. శుక్రవారం హైదరాబాదులోని మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో రోడ్ షో నిర్వహించడంలో భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి స్వాగతం పలికారని తెలంగాణలో బిజెపిని గెలిపిస్తే ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. దేశంలో స్వచ్ఛమైన పాలన అవినీతి రహిత పాలన కుటుంబ పాలనకు దూరంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేది ఒక బీజేపీ మాత్రమే అని అన్నారు. ఎన్నో క్లిష్టమైన సమస్యలను బిజెపి ఎదుర్కొని ప్రజల మనోభావాలను గెలుచుకుందని అన్నారు అందుకు అయోధ్య నిర్మాణమే ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.