Tuesday , July 16 2024

నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 18):

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవిలో ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ సమీపంలో మల్లెలతీర్థం అటవీ ప్రాంతంలో అడవి అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ ప్రాంతం దాటి గుండాల వైపు మంటలు వ్యాపిస్తున్నాయి.
దాదాపు వంద ఎకరాలలో అగ్నికీలలు అడవిని చుట్టుముట్టాయి.మంటలు ఆర్పడానికి అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు.మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో వారికి కొందరు అటవీ శాఖ సిబ్బందికి గాయాలయ్యాయి.
మంటలను అదుపులో తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది అటార్ సిబ్బంది తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.