Tuesday , July 16 2024

బాధిత కుటుంబాన్ని పరామర్శించి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలరాజు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, (మార్చి 16):

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండల కేంద్రానికి చెందిన డేగ హరికృష్ణ శనివారం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో మృతి చెందిన విషయం తెలుసుకొని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మృతుని పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి భరోసా కల్పించారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.