లోకసభ ఎన్నికలకు ముందు
రాజకీయ కక్షతోనే అరెస్టు.
అమ్రాబాద్ మండల బిఆర్ఎస్ నాయకులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 16):
బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమమని, సుప్రీం కోర్టులో కేసు పెండింగులో ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఈ డీ సోదాలపేరుతో అరెస్టు చేయడం తెలంగాణ ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నదని, ఎమ్మెల్సీ కవిత అరెస్టును నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం బిఆర్ఎస్ నాయకులు యర్ర నాసర్ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ సీరియల్ తలపించేలా ఇన్నిరోజులు విచారణ పేరుతో అయోమయానికి గురిచేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ తీరా లోకసభ ఎన్నికలకు ముందు అకారణంగా అరెస్టు చేయడం రాజకీయ కక్షలకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడమేనని దుయ్యబట్టారు.ఇది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమేనన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి పథంలో ముందుకుపోయిన రాష్ట్రాన్ని చెల్లా చెదురు చేసి తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బీజేపీ జాతీయ నేతలు పన్నిన రాజకీయ కుట్రలో భాగమేనన్నారు.రాజకీయ కుయుక్తులతో తెలంగాణ సాధకుడు కేసీఆర్ మనోధైర్యాన్ని ఇంచుక మందం కూడా కదిలించలేరని, ఇటువంటి ఎన్నో ఆటుపోట్లను చూసిన ఉక్కుగుండె కేసీఆర్ ది అన్నారు.ఇటువంటి చర్యలకు బెదిరేదిలేదనీ, ఎంఎల్సీ కవితకు యావత్ తెలంగాణ సమాజం అండగా నిలుస్తుందని స్పష్టం చేసారు.
న్యాయస్థానాల్లో పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ధరిమయ్య, శివ, జహంగీర్, జగన్, మల్లి తదితరులు పాల్గొన్నారు.