Thursday , May 23 2024

రాయల్ గండి శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా జిల్లా స్థాయి కోలాటాల ప్రదర్శన.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (మార్చి
15):

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల పరిధిలో గల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి జాతర ఈనెల 13 నుంచి నిర్వహించిన జాతర ఉత్సవాలలో భాగంగా శుక్రవారం జిల్లా స్థాయి కోలాటాల ప్రదర్శన నిర్వహించారు గ్రామాల నుంచి వచ్చిన కోలాటాల బృందాలకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సతీమణి మరియు సి.బి.ఎం ట్రస్ట్ చైర్పర్సన్ అమ్రాబాద్ మండల జడ్పిటిసి డాక్టర్ అనురాధ ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ మాట్లాడుతూ ఉత్సవాల తరలివచ్చిన విజయవంతం చేసిన ప్రజలకు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.