Wednesday , July 24 2024

రేపే నాగర్ కర్నూల్ కు ప్రధాని మోడీ రాక.

తొలిసారి నాగర్ కర్నూల్ గడ్డపై అడుగుపెడుతున్న మోడీ.

లక్షకుపైగా జనం తరలివచ్చేలా సభ ఏర్పాట్లు.

సభ సక్సెస్ చేసేలా బీజేపీ ప్లాన్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (మార్చి 15):

నేడు శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి ప్రధానమంత్రి మోడీ తొలిసారిగా ఎన్నికల సందర్భంగా బిజెపి చేపట్టిన సంకల్పయాత్ర సభకు విచ్చేయుచున్నారు. ఈ సందర్భంగా బిజెపి చేపట్టిన సంకల్ప యాత్ర సభకు లక్షకు పైగా జనం తరలివచ్చేలా సభను ఏర్పాటు చేసి సభ సక్సెస్ చేసేలా బిజెపి శ్రేణులు ప్లాన్ చేస్తున్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, మాజీ ఎమ్మెల్యే ఎం వి ఎస్ ప్రభాకర్, బిజెపి నాయకులు ఏలేటి సుధాకర్, జక్క రఘునందన్ రెడ్డి, దిలీప్ ఆచారి ,శనివారం ఉదయం 11 గంటలకు జరిగే బీజేపీ విజయసంకల్ప సభ కు మూడు వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు. నాగర్కర్నూల్ గడ్డపై కాషాయం జెండా ఎగిరేయడం ఖాయం అంటున్నారు. బిజెపి అభ్యర్థి భారత్ ప్రసాద్ ఎంపీగా గెలిస్తే నాగర్కర్నూల్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మద్దతుగా వివిధ గ్రామాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మూడోసారి ప్రధానమంత్రి చేయాలని అందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. నాగర్ కర్నూల్ లో నిర్వహించే బిజెపి విజయసంకల్పయాత్ర సభలో ఎన్నికల శంఖారావం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూరించనున్నారని అన్నారు అదేవిధంగా జాతీయ రహదారి 167 కిలోమీటర్ల పనులు నడుస్తున్నాయని అది కూడా కంప్లీట్ చేస్తామన్నారు. రెండోది గద్వాల మాచర్ల రైల్వే లైన్ ప్లాన్ లో ఉందని ప్రపోజల్ నడుస్తుందని తెలిపారు. ఈ మధ్యకాలంలో గద్వాల టు డోర్నకల్ రైల్వే లైన్ కు కేంద్ర ప్రభుత్వం సర్వే కోసం 14 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. శనివారం జరిగే కార్యక్రమానికి తమ ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏర్పాట్లను పర్యవేక్షించిన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపి అభ్యర్థి భరత్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్ ప్రభాకర్, ఎల్లేటి సుధాకర్, జక్కా రఘునందన్ రెడ్డి, దిలిపాచారి…

ఉదయం 11 గంటలకు బీజేపీ విజయ సంకల్ప సభ

3 వేల మందితో భారీ బందోబస్తు

కందనూలు గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమంటున్న భరత్

ఎంపీగా గెలిస్తే నాగర్ కర్నూల్ లోక్ సభ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా…

నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత ప్రసాద్ గారు మాట్లాడుతూ:

లోక్సభ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి నిర్వహిస్తున్న విజయసంకల్ప సభకు ముఖ్యఅతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొననున్నారు.
నాగర్కర్నూల్ గడ్డపై అడుగుపెడుతున్న నరేంద్ర మోడీ గారికి మద్దతుగా గ్రామ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని అన్నారు.
నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
రేపు ఉదయం 11 గంటలకు నరేంద్ర మోడీ గారు ఇక్కడ సభ నుంచి మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
అయోధ్య రామునికి గుడి కట్టించిన మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.
మోడీ గారు ప్రధానమంత్రి కావాలి మా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి ఎంపీగా బిజెపి అభ్యర్థి అయిన నన్ను గెలిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ రేపు పొద్దున్న నాన్నగారు (ఎంపీ రాములు గారు) చేసిన ఏవైనా పెండింగ్ పనులు మిగిలి ఉన్న వాటిని పూర్తి చేస్తానన్నారు. అదేవిధంగా ఈ జాతీయ రహదారి 167k పనులు నడుస్తున్నాయి,అది కూడా కంప్లీట్ చేస్తామన్నారు.
రెండోది గద్వాల్ మాచర్ల రైల్వే లైన్ ఉంది. అది కూడా ప్రపోజల్ నడుస్తుంది అది కూడా కంప్లీట్ చేయాలంటే కేంద్రానికి మరియు రాష్ట్రానికి వారిదిగా మేము ఉంటాము.
ఈ మధ్యకాలంలో గద్వాల్ టు డోర్నకల్ రైల్వే లైన్ కు కేంద్ర ప్రభుత్వం సర్వే కోసం 14 కోట్లు కేటాయించడం జరిగింది.
రేపటి కార్యక్రమానికి మేము అనుకున్న దానికి అంటే ఎక్కువ మంది రావచ్చు గ్రామాల్లో అయోధ్య రాముని అక్షింతలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారంతట వారే వస్తారని ఆశిస్తున్నాను.
ప్రధాని నరేంద్ర మోడీ గారి మరియు నాగర్ కర్నూల్ పార్లమెంటు ప్రజల ఆశీస్సులతో గెలుస్తామన్నారు.