సిపిఎం మండల కార్యదర్శి శంకర్ నాయక్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 15):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండల కేంద్రంలోని గోదల్ వైపున వెళ్లే రోడ్డు మార్గాన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని 26 సర్వే నెంబర్లో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం పట్టాల పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్ డిమాండ్ చేశారు.
బల్మూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం నిరసన తెలియజేస్తూ డిప్యూటీ తాసిల్దార్ పర్సుకి వినతి పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇల్లు నిర్మాణం చేసుకుంటే నిర్మాణం చేసుకొనియకుండా అడ్డుకొని ఇచ్చిన ప్లాట్లను రద్దు చేయడం దుర్మార్గమని వారు ఆవేదన వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యొక్క అహంకారానికి తెలంగాణ పేద ప్రజలు బుద్ధి చెప్పారని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి మూడు నెలలు కావస్తుంది ఇప్పటికైనా బల్మూర్ మండల కేంద్రంలో గోదాల్ రోడ్డు వైపున వెళ్లే మార్గాన ఉన్న ఐదు ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు పంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు పంచకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను గుర్తించి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు ఎండీ లాల్ మహమ్మద్, సీనియర్ నాయకులు బాలీశ్వరయ్య, గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు, సిపిఎం పార్టీ నాయకులు బాబర్, మాసయ్య, రాజు, తదితరులు ఉన్నారు.