Wednesday , July 24 2024

అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,(మార్చి 15):

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పురాతన భవనంలో ఉన్న ఆస్పత్రిని పూర్తిగా పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు, నర్సులకు, వైద్య సిబ్బందికి సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది, సమయపాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు.