Sunday , May 26 2024

రాయలగండి దేవాలయాన్ని దర్శించుకున్న మాల మహానాడు నేత చెన్నయ్య.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 15 ):

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం రాయలగండి గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య దర్శించుకున్నారు. నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్యను శాలువతో సన్మానించారు. అనంతరం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలగండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవాలయం ను ప్రభుత్వం మరిన్ని వసతులతో ఏర్పాటుచేసి అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మాలలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటును మాల మహానాడు స్వాగతిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాసరయ్య, కుంద మల్లికార్జున్,నరహరి,బాబు, సుబ్బదాసు, బాల కుమార్, ఆనంద్,రమేష్,వెంకటేశ్వర్లు,
అనిల్ తదితరులు పాల్గొన్నారు.