Wednesday , July 24 2024

ఘనంగా బీఎస్పీ అధినేత కాన్సిరాం 90వ జయంతి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 15):

బి ఎస్ పి పార్టీ వ్యవస్థాపకుడు అధినేత స్వర్గీయ మాన్యశ్రీ కాన్సిరాం 90వ జయంతి సభను శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో ఆ పార్టీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాన్యశ్రీ కాన్షిరాం ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బి.ఎస్.పి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రానున్నది బహుజన రాజ్యం అని దళిత, బడుగు, బలహీన, వర్గాల కోసం మాన్యశ్రీ కాన్షిరాం ఎంత కృషి చేశారని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు బహుజన రాజ్య స్థాపన కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లాలోని బిఎస్పి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేత కాన్సిరాం కు నివాళులర్పించారు.