Sunday , May 26 2024

సర్పంచులకు రావలసిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మంత్రికి వినతి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (మార్చి 9):

రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క శుక్రవారం అమ్రాబాద్ మండల పర్యటనకు వచ్చిన సందర్భంగా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ సర్పంచ్ చత్రు నాయక్ మంత్రి సీతక్కను కలిసి సర్పంచులకు రావలసిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని సర్పంచ్ల ఇబ్బందుల గురించి వివరించారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించారని
త్వరలోనే మీ బిల్లులు చెల్లిస్తామని చెప్పడం జరిగిందని, 15 ఫైనాన్స్ ద్వారా వస్తున్న నిధుల్లోనుండి మీ కోరిక మేరకు సర్పంచుల పెండింగ్ బిల్లులను చెల్లించే త్వరలోనే మంత్రివర్గంలో చర్చించి ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు వారు కృతజ్ఞతలు తెలిపారు.