Wednesday , September 18 2024

ఉమామహేశ్వరం దేవస్థానంలో అన్నదానానికి ముస్లింల విరాళం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 3):

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలోగల శ్రీశైల ఉత్తరముఖ ద్వారమైన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానాన్ని ఆదివారం మహబూబ్నగర్ పట్టణానికి చెందిన ముస్లింలు ఎస్.కె. మన్సూర్ పెద్ద కుమారుడు ఎస్ కే. మీనాజ్ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉమామహేశ్వర దేవాలయ అభివృద్ధిని చూసి తన హర్షం వ్యక్తం చేస్తూ ఆలయ ప్రాంగణంలో నిర్వహించే నిత్య అన్నదానానికి తన వంతుగా1,00,116 రూపాయలను విరాళంగా ఆలయ చైర్మన్ కందూరి సుధాకర్ కు అందజేశారు. అనంతరం దాతలకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.