Wednesday , September 18 2024

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి.

ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 3):

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు.ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బలమూరు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినట్లుగానే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరుగ్యారెంటీల పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆరోగ్యారెంటీలను ప్రజల్లోకి ఇంటింటికి గడపగడపకు విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని పిలుపునిచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పని చేశారో అదే విధంగా కార్యకర్తలందరూ ముఖ్య నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి మన అచ్చంపేట నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నేత అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత
గంగపురం రాజేందర్,
మండల పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్, మండల సీనియర్ నాయకులు శ్రీపతిరావు నర్సింగ్ రావు సుధాకర్ గౌడ్, ఖదీర్ కాశన్న యాదవ్, ఓబీసీ సెల్ అధ్యక్షులు గిరి వర్ధన్ గౌడ్, మైసన్న మండల ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.