బిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు & అచ్చంపేట మాజి శాసనసభ్యులు గువ్వల బాలరాజు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 3):
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని వీఆర్ఏ పార్టీ జిల్లా అధ్యక్షులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.
ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలనీ బిఆర్ఎస్ పార్టీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.డిసెంబర్ 9న రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు నీళ్లు వ్వకుండ కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు.నాడు తెలంగాణ రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి కెసిఅర్ నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే తపనతో ప్రాజెక్టులు నిర్మించి రైతాంగానికి సాగునీరు అందించి రైతులను రారాజులుగా మార్చారని అన్నారు మా ప్రభుత్వంలో భర్తీ చేసిన ఉద్యోగాలు, నేడు మేము భర్తీ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గణేష్ రావు, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు సురేందర్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.