బల్మూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం వెంకటయ్య.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 3):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అచ్చంపేట వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించడంతో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.వెంకటయ్య తమకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ఆదివారం ఒక ప్రకటన ద్వారా విన్నవించుకుంటున్నారు. 1995 నుంచి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ తరఫున బల్మూర్ మండల వార్డు సభ్యుడుగా పనిచేశానని 2009లో అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడిగా పనిచేశానని, కాంగ్రెస్ పార్టీ నేత దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు ప్రాణమని, కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పనిచేసిన తనకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు. 2014 నుంచి 2023 వరకు పార్టీలు మారమని తనపై ఎంతో వత్తిడి చేసి తనకు ఎన్నో విధాలుగా ఆశలు ,ప్రలోభాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీలో పనిచేశానని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అచ్చంపేట పట్టణంలోని కోర్టు ముందు ఉద్యమ పోరాటంలో పాల్గొన్నానని,కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడకుండా పనిచేస్తూ వస్తున్నానని నల్లమల టైగర్ డాక్టర్ వంశీకృష్ణ గెలుపు కోసం నాటి నుంచి నేటి వరకు కృషి చేశానని, గత 20 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని బతుకుతూ తనకు ఉన్న రెండు ఎకరాల భూమిని కూడా అమ్ముకుని బ్రతుకుతున్నానని, ఎలాగైనా తన శ్రమను పార్టీ గుర్తించి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నాపై దయ ఉంచి అచ్చంపేట మార్కెట్ చైర్మన్ ఎస్సీలకు కేటాయించబడింది కనుక అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు.