పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 18):
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని గిరిజన భవన్ లో ఆదివారం సంత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను లంబాడా గిరిజనులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిసిసి జిల్లా అధ్యక్షులు మరియు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాగర్ కర్నూల్ రోడ్డులో గల గిరిజన భవన్ వరకు బంజారా సోదరులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు బంజారాల పూజారిలతో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన బోగ్ బండార్ ఉత్సవాలను ఆనందోత్సవాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ సంతు సేవాలాల్ మహారాజ్ ని లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారని
సంతు సేవాలాల్ జయంతి ఉత్సవాలకు నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన బంజారా వాసులకు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.సేవాలాల్ మహారాజ్ గారి గుడి కోసం ఎకర భూమి కేటాయిస్తానని, వచ్చే సంవత్సరం ఈ ఉత్సవాలు కొత్తగా నిర్మించిన గుడిలో జరుపాలని బంజారాలకు సూచించారు.1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా రాంజీనాయక్ తండాలో సేవాలాల్ మహారాజ్ జన్మించారని,సేవాలాల్ శివ పూజారుడు. ఆయన తండ్రి, తాతలు తెగ పెద్దలు. తొమ్మిది రోజుల పాటు పెళ్లికాని యువతులు తీజ్ ఉత్సవాల్లో పాల్గొని తమకు వివాహం కావాలని పూజలు చేస్తారని,.సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రజల కోసం చేసిన ఉద్యమాలలో ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులను అరికట్టడం వంటివి ఉన్నాయని అన్నారు.
సన్మార్గంలో తన జాతిని నడిపించి భారత్ లోనే దాదాపు 11 కోట్ల బంజారా లకు ఆరాధ్య దైవంగా ఆయన నిలిచారని,బంజారాలు రాజపుత్రుల్లాంటి వారని చరిత్ర కారుడు కల్నల్ టాడ్ పేర్కొన్నారంటే వారెంత దృఢకాయులో అర్థం అవుతుందని అన్నారు.
లంబాడీలు, బంజారాలు, సుగాలీలు, గ్వార్ భాయ్ అని పిలవబడుతున్న ఈ గిరిజనులు ప్రపంచవ్యాప్తంగా గోర్ బంజారాలుగా పేరుపొందారు.మధ్య యుగంలో మహమ్మద్ ఘోరీకి వ్యతిరేకంగా పృథ్వీరాజ్ చౌహాన్ పక్షాన పోరాడిన వీరోచిత చరిత్ర బంజారాల సొంతం. దక్కన్ పీఠభూమిలో లంబాడీలు కాకతీయుల కంటే ముందే ఉన్నారని, సంచార జాతివారైనా వీరు రజాకార్లతో పోరాడారని, నవాబులు వారి ధైర్యసాహసాలకు మెచ్చి భూములను ఇనాములుగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. బంజారాలు ఎవరికీ హాని తలపెట్టేవారు కాదని, సహాయ గుణం విరివిగా కలవారని, ధైర్యసాహసాలకు ప్రతీకలనీ చరిత్ర ద్వారా తెలుస్తుందని
తరతరాలుగా జాతి వివక్షకు గురవుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధిలో వెనుకబడి ఉన్న లంబాడాలను అభివృద్ధి చేయాల్సిన అవసరముంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం నుంచి వివిధ మండలాల నుంచి వచ్చిన బంజారా సోదరులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.