తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 3):
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో ఆదివారం మహబూబ్నగర్ నారాయణపేట మక్తల్ రాయచూర్ ప్రాంతాల నుంచి శివ స్వాములు పాదయాత్రగా శ్రీశైలం వెళుతున్న సందర్భంగా ఈ ప్రాంతానికి చెందిన శివ స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొని శివ స్వాములకు అన్నదానం చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ శ్రీశైలం వెళ్ళే స్వాములకు ఏలాంటి ఇబ్బంది కలగొద్దు. అనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటు చేసిన నీటి బోరు ప్రారంభించారు.