Thursday , May 23 2024

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పోలీస్ మెగా హెల్త్ క్యాంప్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 3):

నాగర్ కర్నూల్ జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ ఐపీఎస్ చే నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న పోలీస్ పర్సనల్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కి ప్రజలకు మెగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు మరియు పోలీస్ శాఖ వారికి సుమారు 15 మంది డాక్టర్లచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ 0-5 సంవత్సరాలు గల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు.