Saturday , October 12 2024

పోలియో కేంద్రాలు పరిశీలిస్తూ, చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 3):

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న పల్స్ పోలియో కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పరిశీలించి. చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ
5సంవత్సరాల లోపు పిల్లలకు తల్లిదండ్రులు తప్పకుండ రెండు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
తద్వారా పోలియో ను అంతమోదించి పోలియో రహిత దేశాన్ని నిర్మిద్దామని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు,
కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.