తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 3):
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మార్నింగ్ లో భాగంగా పట్టణంలో ఉదయాన్నే రోడ్డు ఇరువైపులా ఉన్నటువంటి వ్యాపారస్తులతో, చిరు వ్యాపారులను పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందరికి అందుబాటులో అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేస్తుందని అన్నారు. అనంతరం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళలకు ఉచిత ప్రయాణం గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ నేత రాజేందర్, అచ్చంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటకం రఘురాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.