చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ మౌనిక.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 2):
బాల్యవివాహాల నిర్మూలనపై యువత ,విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ నల్లవెల్లి మౌనిక పిలుపునిచ్చారు .శనివారం నాగర్ కర్నూలు జిల్లా పదర మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో డిడబ్ల్యూఓ విజయలక్ష్మి ఆదేశానుసారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా కో-ఆర్డినేటర్ నల్లవెల్లి మౌనిక మాట్లాడుతూ విద్యార్థులు బాల్యవివాహాలు బాల కార్మిక వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సోషల్ మీడియాపై ఆధారపడకుండా అంశాలపై పట్టు కలిగి ఉండాలని సోషల్ మీడియా యువతను చెడు మార్గంలోకి తీసుకు వెళుతుందని, దానికి దూరంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండి సామాజిక అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందు వరుసలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సృజన ఐసిడిఎస్ ప్రతినిధులు సువర్ణ సునీత పద్మావతి తదితరులు పాల్గొన్నారు.