Monday , September 16 2024

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మే 20):

నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎస్ ఏవి గుప్తా ఉన్నత పాఠశాలలో 1997-98 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం అచ్చంపేట పట్టణంలోని లోటస్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో దేశ విదేశాలలో ఉన్న మిత్రులు కూడా పాలు పంచుకోవడం విశేషం దుబాయ్, పూణే, బెంగళూరు, రాష్ట్రాలలో స్థిరపడి ఉన్న మిత్రులు కూడా రావడం అందరిని కలవడం మధురానుభూతులను పంచుకోవడం అనంతరం బోధించిన గురువులు పూర్వ విద్యార్థులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. అనంతరం విద్యాబోధించిన గురువులు సూరిశెట్టి, విజయ్ కుమార్ జానకి సూరిశెట్టి, గణేష్, సంధ్యారాణి, వెంకటేశ్వర శర్మ, పాండు, వేణుగోపాల్, వెంకటయ్య, నాగరాజు, ఉపాధ్యాయులను శాలువాకపై ఘనంగా సన్మానించారు ఇక ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు దాదాపు 40 మంది పాల్గొని ఆటపాటలతో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు.పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
1997/98.ఎస్ ఎ వీ గుప్త హై స్కూల్.10.వ తరగతి విద్యార్థులు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట లోటస్ ఫంక్షన్ హాల్ నందు 19/05/2024. ఆదివారం రోజు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది
దేశ విదేశాలలో ఉన్న . మిత్రులుకూడా ఆత్మీయ సమ్మేళనంలో పాలు పంచుకోవడం జరిగింది
. దుబాయ్. పూణే. బెంగళూరు లో స్థిరపడి ఉన్న మిత్రులు కూడా పాల్గొని ఆ మధురానుభూతులను తోటి మిత్రులతో పాలుపంచుకోవడం జరిగింది
ఆత్మీయ సమ్మేళనంలో గురువులను ఆహ్వానించి వారినీ ఘనంగా సన్మానించడం జరిగింది. గురువులు విద్యార్థులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు
గురువులు. సురిశెట్టి విజయ్ కుమార్. జానకి. సూరిశెట్టి గణేష్ సంధ్యారాణి. వెంకటేశ్వరశర్మ . పాండు. వేణుగోపాల్. వెంకటయ్య. నాగరాజు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఆత్మీయ సమ్మేళనానికి పూర్వ విద్యార్థులు 40 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు