తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (మే 20):
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని నల్లమల ప్రాంతంలో గొర్రెల యజమానులు తమ ధర్లను ప్రాంతంలో నేర్పడానికి వెళుతుండగా నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ అటల్ శాఖ అధికారులు గొర్ల కాపరులను అడ్డుకొని అడవి ప్రాంతంలో గొర్లను లేపరాదని అడ్డుకోవడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశన్న యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడి గొర్రెల కాపరులకు నచ్చచెప్పి వారి గోర్లను మోపడానికి అడవి ప్రాంతంలోకి గొర్లను తరలించారు. అనంతరం అధికారులు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం స్థానిక స్థానికేతర పశువుల గొర్రెల కాపరులకు అటవీ ప్రవేశం ఏసేదించడమైందని గొర్రెలు పశువుల నుండి ఆటవీజంతోలకు కాళ్ల వైరస్ వ్యాపిస్తున్న కారణంగా గొర్రెలు, పశువులకు, ప్రస్తుత సంవత్సరం నిషేధించడం అయిందని అందువల్లనే గొర్రెలను గొర్ల కాపర్లను అడ్డుకోవడం జరిగిందని తెలిపారు ఇది గమనించి గొర్ల కాపర్లు పశువుల కాపర్లు అటవీ ప్రాంతంలో తమ పశువులను గొర్లను తీసుకువెళ్లరాదని సూచించారు.