Wednesday , July 24 2024

అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ 5 6 న ఉచిత సర్జికల్ క్యాంప్.

నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకోండి.

డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (మే 20):

జూన్ 5 ,6 తేదీలలో అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో సర్జికల్ క్యాంపు అన్ని రకాల శస్త్ర చికిత్సలు( ఆపరేషన్లు ) చేయడం జరుగుతుందని,
నల్లమల ముద్దుబిడ్డ
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే
డా.చిక్కుడు వంశీకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ఇట్టి సర్జికల్ క్యాంపులో అన్ని రకాల ఆపరేషన్లను పూర్తిగా ఉచితంగా చేయడం జరుగుతుందని పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ యొక్క సమాచారాన్ని కూడా నియోజకవర్గ ప్రజలందరికీ తమ తమకు తెలిసిన వారందరికి కూడా సమాచారం ఇచ్చి ఈ అవకాశం పేద ప్రజలందరూ ఉపయోగించుకునే విధంగా మన వంతు బాధ్యతగా సమాచారం ఇవ్వాలని తెలిపారు.