Monday , September 16 2024

నేడు జరిగే ఎన్నికల్లో భారత రాజ్యాంగం గెలవాలి , ప్రజలు గెలవాలి.

డిసిసి వైస్ ప్రెసిడెంట్ అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతిది (మే 13):

నేడు జరిగే భారత పార్లమెంట్ , ఎన్నికలు భారత రాజ్యాంగానికి వ్యతిరేకించే వారికి, భారత రాజ్యాంగం రక్షించబడాలి అని పోరాటం చేస్తున్న వారికి, రాజ్యాంగ వ్యతిరేకి మోడీకి, కెసిఆర్ కి మధ్య జరుగుతున్న ఎన్నికలను డిసిసి ఉపాధ్యక్షులు అడ్వకేట్ కోయాల శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 సీట్లు మాకు ఇవ్వండి భారత రాజ్యాంగాన్ని మారుస్తామని భారతదేశ ప్రధానమంత్రి భారత ప్రజలకు సవాలు చేశారు .భారత రాజ్యాంగం రద్దు చేస్తే మను చరిత్రను అమలు చేస్తామని రవిశంకర్ ప్రసాద్ అని భాజపా కేంద్రమంత్రి అంతకుముందే ప్రకటించడం జరిగిందని,. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటించడం జరిగిందని. అప్పటి అచ్చంపేట శాసనసభ్యులు గా ఉన్న గువ్వల బాలరాజు భారత రాజ్యాంగ మారిస్తే తప్పేంటని బహిరంగంగా పత్రికాముఖంగా మాట్లాడడం జరిగిందని. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నది పార్టీలకు మధ్య పోటీ కాదు రాజ్యాంగాన్ని రక్షించే వారికి అనగా రాజ్యాంగ రక్షణ కోసం పని చేస్తున్న వారికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలకు జరుగుతున్న ఈ యుద్ధంలో భారత రాజ్యాంగం గెలవాలన్నారు. ప్రజలు గెలవాలని, ఈ ఎన్నికల్లో భారత దేశ ప్రధాని, మళ్లీ మోడీ అయితే ఇక వచ్చే భవిష్యత్తులో భారత దేశంలో ఎన్నికలు ఉండవని ఎంతోమంది ప్రముఖులు పత్రికాముఖంగా చెప్పడం జరిగిందని అన్నారు. అదేవిధంగా భారత న్యాయ వ్యవస్థ ప్రమాదంలో ఉందని భారత న్యాయమూర్తులు కూడా దీనిని ప్రజలే కాపాడుకోవాలని గతంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే కావున భారత రాజ్యాంగ లక్ష్యమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీకి ఓటు వేయాలని విజ్ఞులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.