Saturday , October 12 2024

రక్షిత మహిళా సొసైటీ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మే 13):

అమ్మ అన్న పదం అద్భుతం! అమ్మకి అద్భుతం మన జీవితం! మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ రక్షిత మహిళా సొసైటీ వారితో కలిసి ఆదివారం డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సతీమణి సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం జడ్పిటిసి డాక్టర్ అనురాధ మదర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ మాట్లాడుతూ కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల సహకారాన్ని అందిస్తున్నడీజీ రక్షిత మహిళా సొసైటీ అని నిరుపేదలకు అండగా నిలిచి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నది రక్షిత మహిళా సొసైటీ వారు అభినందించారు.
మహిళలను చైతన్యపరుచుతూ అన్ని రంగాలలో రాణించే విధంగా చేయూత అందిస్తున్నది రక్షిత మహిళా సొసైటీ కృషి చేస్తుందన్నారు.నల్లమల ప్రాంతంలో రాత్రి పగలు తేడా లేకుండా సేవా దృక్పథంతో పేదలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్న సంస్థ రక్షిత మహిళా సొసైటీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అక్షరాలు అమలు చేస్తూ రక్షిత మహిళ సొసైటీ ద్వారా మాతృభూమి ఋణం తీర్చుకోవడానికి నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట నియోజకవర్గంలో సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న రక్షిత మహిళా సొసైటీని వారు ఆభినందించారు.రక్షిత మహిళా సొసైటీ సభ్యులకు మరియు అచ్చంపేట నియోజకవర్గ మహిళలకు ప్రజలకు “అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు”.. కంటిపాపలా కాపాడే అమ్మ లకు ‘మదర్స్ డే’ శుభాకాంక్షలు తెలియజేశారు..!