Wednesday , July 24 2024

హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లింలను సన్మానించిన ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (మే 12):

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మరియు అమ్రాబాద్ గ్రామాలకు చెందిన ముస్లిం మైనార్టీలు ఆదివారం హాజ్ యాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వారికి శుభాకాంక్షలు చెప్పి పూలమాలవేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హాజ్ యాత్ర విజయవంతంగా ముగించుకొని క్షేమంగా తిరిగి రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు