Monday , September 16 2024

దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ని పరామర్శించిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి
(మే 13):

దేవరకొండ మాజీ శాసనసభ్యులు, నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ నాయక్ తండ్రి కనిలాల్ నాయక్ మృతి పట్ల నాగర్ కర్నూలు జిల్లా బి.ఆర్. ఎస్ పార్టీ అధ్యక్షులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంతాపం తెలియజేశారు. ఆదివారం దేవరకొండ మండలంలోని రత్యానాయక్ తండాలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ కుటుంబ సభ్యులను కలసి ఆయన పరామర్శించారు.