Wednesday , July 24 2024

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మహిళా సమ్మేళనం కార్యక్రమం లో పాల్గొన్న ఎన్నికల ఎఐసిసి పరిశీలకులు పీవీ మోహన్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 5):

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని బి కే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మహిళా సమ్మేళనం కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డా మల్లు రవి సతీమణి శ్రీమతి రాజ భాన్సి దేవి స్థానిక ఎమ్మెల్యే డా చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
పార్లమెంటు ఎన్నికల్లో మహిళలందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారికి హస్తం గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ రుణం తీసుకోవడానికి ఇదే సరైన సమయం అని మహిళలకు అన్ని రంగాల్లో హక్కులను రిజర్వేషన్లను కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరా గాంధీ అని అన్నారు.పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని,
మహాలక్ష్మి హామీ: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి ప్రతి స్త్రీకి వార్షికంగా ₹1 లక్ష ఆర్థిక సహాయం.
సగం జనాభా, పూర్తి హక్కులు: దీని కింద, ప్రభుత్వం మహిళలకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు ఇస్తుందని,
శక్తి కా సమ్మాన్: కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తుందని.
అధికార మైత్రి: మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించడానికి మరియు అవసరమైన సహాయం అందించడానికి అధికార మైత్రి రూపంలో ప్రతి పంచాయతీలో ఒక పారాలీగల్, అంటే న్యాయ సహాయకుడిని నియమిస్తారు.
సావిత్రీబాయి ఫూలే హాస్టల్: దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కనీసం ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను ఏర్పాటు చేస్తామని, దేశవ్యాప్తంగా ఈ హాస్టళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని పార్టీ హామీ ఇచ్చిందని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా సాధిారతకు పాటుపడుతుందని,
మహిళలకు ఆర్టీసి బస్సు లో మహిళకు ఉచిత ప్రయాణం ,
ఉచిత గ్యాస్ సిలిండర్,
మొదలైన అనేక హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెసు ప్రభుత్వం కు దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల అచ్చంపేట ఇన్చార్జి రాము యాదవ్, అమ్రాబాద్ జెడ్పీటీసీ డా.అనురాధ ,రాష్ట్ర మహిళా నాయకులు శారదమ్మ , కౌన్సిలర్ సునీత, మహిళా కాంగ్రెస్ నాయకులు సుశీల వివిధ గ్రామాల మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.