Tuesday , July 16 2024

నా ఓవర్ కాన్ఫిడెన్సీ నా కోపం వచ్చింది.

సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 25):

నాగర్ కర్నూలు జిల్లా పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తన ఓవర్ కాన్ఫిడెన్సి ఎన్నికల్లో నా కొంపముంచిందని తన తప్పును ఒప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీనివాస యాదవ్ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.