Wednesday , July 24 2024

నాగర్ కర్నూల్ చరిత్రలో ఎంపీ అభ్యర్థిగా మహిళ పోటీ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 5):

నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా గాలిమూడి గీత నామినేషన్ వేయడంతో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆదివారం చిరు వ్యాపారులతో మమేకమై క్షేమ సమాచారాలు అడుగుతూ ముమ్మర ప్రచార నిర్వహించారు చిరు వ్యాపారులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు చరిత్రలో ఎంపీ అభ్యర్థిగా ఓక మహిళా అభ్యర్ధి పోటీ చేయడం ఇదే ప్రథమం.. ఎంపీ ఎన్నికలలో సీరియల్ నెంబర్ 13, ఉంగరం గుర్తుకు ఓటేయాలనీ కోరారు. ఒక్కసారి గాలీముడి గీతక్క కూ అవకాశం ఇవ్వండి అని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో గండికోట శ్రీను, (మాజీ సర్పంచ్, సింగిల్ విండో డైరెక్టర్), కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.