Tuesday , July 16 2024

నేడు బిజెపి ఎంపీ అభ్యర్థి ఉరుకొండ పేటకు రాక.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 5):

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సోమవారం బిజెపి అభ్యర్థి డీకే అరుణ ఉర్కొండ మండలానికి రానున్నట్లు బిజెపి శ్రేణులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరుకొండ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముచ్చర్ల జనార్దన్ రెడ్డి హాజరై మండల నాయకులతో పాటు కార్యకర్తలతో చర్చించడం జరుగుతుందని తెలిపారు. మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు అరుణమ్మ వెంబడి ప్రచార కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేసి, జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన మండలం నుండి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు, బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.