Tuesday , July 16 2024

కాంగ్రెస్ పార్టీలో చేరినమాజీ ఎమ్మెల్యే గువ్వల పిఏ వంగూరు రాజేష్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 4):

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారకొండ మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన వంగూరు రాజేష్ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యక్తిగత సహాయకుడు( పిఏ ) వంగూరు మండల్ జడ్పిటిసి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈసందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువాతో పార్టీలోకి సిఎం సాదరంగా ఆహ్వానించారు.కలిసిన మరుసటి రోజు రాజేష్ అచ్చంపేట గౌరవ ఎమ్మేల్యే డాక్టర్ వంశీకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచే బి ఆర్ ఎస్ అంటే అప్పటి టిఆర్ఎస్ ఉద్యమంలో కీలకంగా పనిచేసి పార్టీ పటిష్ఠం కోసం కృషి చేశారని,
పదేళ్ల డి ఆర్ ఎస్ పాలనలో నియంత పోకడ వ్యవహారంతో దోచుకోవడం తప్పితే ఉద్యమకారులకు ఓరగపెట్టింది ఏమీ లేదని వ్యక్తిగతంగా పార్టీకి నాయకునికి ఎంత చేసిన విశ్వాసం లేని నాయకుల దగ్గర ఆత్మగౌరవం చంపుకొని ఉండటం కంటే ప్రాంత బిడ్డ సిఎం పాలనలో ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. ప్రజాస్వామ్యం కల్గిన కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని నాతో పాటు ఎంతోమంది మండలం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని బి ఆర్ ఎస్ పార్టీ మండలంలో మనుగడ లేకుండా పోయిందని దానికి కారణంగా గతంలో పాలించిన నాయకుని లోపమే కారణం అని చెప్పుకొచ్చారు.