ఆగస్టు 15 నా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తాం.
డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 4):
ఆగస్టు 15 నాటి కి రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శనివారం అచ్చంపేట నియోజకవర్గం చారకొండ మండలం రామచంద్రపురం, సిరిసనగండ్ల ,గైరంతాండ, వంకరయ్య తాండ ,అగ్రహారం తండా, శాంతి గూడెం, బోరబండ తాండ, మర్రిపల్లి గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయా గ్రామాలలో రోడ్ షో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఈనెల 13వ రోజు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి అని అన్నారు.రాష్ట్రం లో మాదిరిగానే కేంద్రములో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.2022 వరకు దేశములో ఉన్న పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో బిజెపి చెప్పి మాట తప్పిందని,ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కడ ఇల్లు కట్టిచ్చారో భాజపా నేతలు చెప్పాలి.
బిజెపి, బిఆర్ఎస్ లకు ఓటు అడిగే హక్కులేదని,
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీ లు అమలు చేశాం. అని అన్నారు.
బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారని,
మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే మాకాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. అని అన్నారు.
మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు 10 లక్షల జీవిత భీమా.,నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డా.మల్లురవిని భారీ మెజార్టీ తో గెలిపించాలని,గడిచిన 10 సంవత్సరం లో తెలంగాణ ప్రజల ఆస్తులును దోచుకున్నారని,మేము పాలకులం కాదు,మేము సేవకులం అన్నారు.ప్రజల యొక్క సమస్యలను చెప్పుకునే విధంగా మాది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందన్నారని అన్నారు.100 రోజుల్లోనే, 200 యూనిట్ల ఉచిత కరెంట్,మహిళలుకు రూ. 500 గ్యాస్,10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ మహిళలకు ఉచిత బస్ ఇందిరమ్మ ఇళ్లు, సీఎం రేవంత్ రెడ్డి గారు దైవ సన్నిధిలో ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నియోజక వర్గానికి 3500 ఇల్లు మంజూరు చేశామని కెసిఆర్ బారాస ను ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అందుకే ఇచ్చిన మాట నిలపెట్టుకోవడానికి ఇందిరమ్మ రాజ్యం లో ఇచ్చిన 6 గ్యారంటీ లు అమలు చేశాం. చెప్పారు.మాది ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని 2022 వరకు దేశంలో ఉన్న ప్రతి పేదవారికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కడ ఇల్లు కట్టిచారో భాజపా నాయకులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి 2022 నాటికి రైతుల అధ్యాయం రెట్టింపు చేస్తామని మోడీ హామీ ఇచ్చారని,కానీ పెట్టుబడి లేక లక్షల మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దులో దీక్షలు చేస్తుంటే మోడీ ప్రభుత్వం రైతుల పై తుపాకుల తుట పేల్చింది రైతులను బలితీసుకుంది భాజపా ప్రభుత్వం కదాని ప్రశ్నించారు.
ఒక్కసారి దేశ ప్రజలు ఆలోచన చెయ్యాలి మే 13వ రోజున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డా.మల్లు రవిని భారీ మెజార్టీ తో గెలిపించాలని, పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ ,మండల పార్టీ అధ్యక్షుడు బలరాం గౌడ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.