Monday , September 16 2024

అచ్చంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం.

డాక్టర్ మల్లురవిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి.

డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 28):

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం భాగంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి తో కలిసి డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అచ్చంపేట మండలంలోని బక్క లింగాయపల్లి, అక్కారం, గన్పూర్ ,బొమ్మనపల్లి, ,సింగారం,అయినోల్ ,గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని బహిరంగంగా బిజెపి అగ్ర నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న డాక్టర్ మల్లురవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించిన విధంగానే భారీ మెజార్టీ ఇవ్వాలని, మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మారుమూల గ్రామాల్లో ఉన్న పాండవుల చెరువు, ఘనపూర్ నుండి చెన్నంపల్లికి అచ్చంపేట నుండి బక్క లింగాయపల్లికి ఉన్న బీటీ రోడ్డును డబల్ రోడ్డు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తప్పకుండా అమలు తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేయడం జరిగింది…