Wednesday , July 24 2024

మంతటి గ్రామాల్లో కార్డన్ సర్చ్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 28):

నాగర్ కర్నూల్ జిల్లా మంతటి గ్రామంలో లో శనివారం రాత్రి డిఎస్పి శ్రీనివాస ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. మూడు చెక్ పోస్టులు, పది టీములు ఏర్పాటు చేసి కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్డెన్ సర్చ్ నిర్వహణలో 38 బైకులు, మూడు ఆటోలు, లిక్కర్ తో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ ఎస్పి సిహెచ్ రామేశ్వర్ ఆధారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్డెన్ సర్చ్ లో డి.ఎస్.పి శ్రీనివాస్ తో పాటు 3 సీఐలు, పదిమంది ఎస్సైలు, 75 మంది పోలీసులు, పాల్గొని బైక్లను ఆటోలను మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారని తెలిపారు.