Friday , November 15 2024

ముదిరాజ్ రాజులకు అండగా నిలిచిన జోగు రామన్నకు పాలాభిషేకం


కౌశిక్ రెడ్డిని భర్తరఫ్ చేయాలని
డిమాండ్

తెలంగాణ కెరటం స్టేట్ ప్రతినిధి అదిలాబాద్ జూన్ 29:

ముదిరాజులను కించపరుస్తూ పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఉచిత వ్యాఖ్యలను మొట్టమొదటిసారిగా అధికార పార్టీలో ఉండి కూడా ఖండించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు కృతజ్ఞత భావంగా ముదిరాజులు గురువారం రోజు పాలాభిషేకం ఈ సందర్భంగా ముదిరాజ్ మహస రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బొజ్జ నారాయణ ముదిరాజ్,జిల్లా అధ్యక్షులు సలేందర్ శివయ్య ముదిరాజ్ తదితరులు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని మొట్టమొదటిసారిగా ఖండించిన జోగ్ రామన్న రాష్ట్రంలోని బీసీలకు ఆదర్శంగా నిలిచారని, వ్యక్తులపై కోపాన్ని వ్యవస్థపై చూపకుండా పాడి కౌశిక్ రెడ్డికి హితో పలకడం పట్ల ముదిరాజుల కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని బహిరంగంగా ప్రకటించి ముదిరాజులకు అండగా నిలవడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. అదేవిధంగా వాటి కౌశిక్ రెడ్డి కుక్కతోక వంకర అన్నట్లు తాను మాట్లాడకుండా ఫేక్ మార్ఫింగ్ వీడియో అంటూ మీడియా ముందర పెట్టి నేను క్షమాపణలు చెప్తున్నాను అని పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. అంతే కాకుండా ఈటల రాజేందర్ ను రాజకీయంగా నేరుగా ఎదుర్కొనలేక 20 కోట్ల సుఫరి ఇచ్చి హత్య చేసేందుకు కౌశిక్ రెడ్డి కుట్రపన్నడం మూర్ఖత్వమని దీనిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని ముదిరాజ్ మహాసభరాష్ట్ర ఉపాధ్యక్షులు బొజ్జనా రాయన ,జిల్లా అధ్యక్షులు సలేందర్ శివయ్య ముదిరాజ్ తదితరులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అత్యధిక సామాజిక వర్గంగా ఉన్న ముదిరాజులను రాజకీయంగా ఎదుర్కొనలేక భౌతిక దాడులతో హతమార్చడానికి ప్రయత్నాలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈటెల రాజేందర్పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ముదిరాజ్ సామాజిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మన లక్ష్మన్న, పట్టణ అధ్యక్షులు రోక్కడి గంగన్న, కొండ వెంకటి,యూత్ అధ్యక్ష కార్యదర్శులు,బుట్టి శివకుమార్, దొంతు ల ప్రవీణ్, దార వేణి రాము బొజ్జ సంతోష్ బా సెన్ అశోక్ మాడవేణి మోహన్, పులి నగేష్, కాందస్ శ్రీకాంత్, మామిళ్ల గంగాధర్, మందుల దాస్,మాజీ సర్పంచ్ అయినవెని రాజు, దార్శ రమేష్,హన్మండ్లు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు