Sunday , May 26 2024

కామారెడ్డిలో ముదిరాజ్ మహాసభ ఎవరి చేతిలో ఉంది

కాంట్రాక్టు ఉద్యోగి చేతిలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ

  • కొంతమందికే సమాచారం
  • నియంతృత్వ ధోరణిలో వెళ్తున్న జిల్లా
  • అధ్యక్షుడు ఆయన అనుకూల వర్గానికి సమాచారం ముదిరాజులను ఎందుకని ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు ఎవరైనా ఎదిరిస్తే వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం అతని అలవాటు
  • తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి

ముదిరాజుల సంఘం జిల్లా అధ్యక్షుని ధోరణితో కులం ఆబాస్ ఫాలు అవుతుందని పలువురు ముదిరాజులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతను ఓ కాంట్రాక్టు ఉద్యోగి అయినప్పటికీ కులస్తులు అతనిని నమ్మి అతనినీ జిల్లా అధ్యక్షుడిగా చేస్తే ఒంటెద్దు పోకడల పోతూ ఎవరికి సమాచారం ఇయ్యకుండా రాష్ట్రస్థాయి నాయకులు వచ్చిన స్థానికులకు సమాచారం ఇవ్వడం లేదని స్థానిక ముదిరాజులు పేర్కొంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ముదిరాజులకు ఎన్ని చేసినా ఈ ఎన్నికలలో ఇతని వల్ల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది దీంతో భవిష్యత్తులో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముదిరాజులకు ఎలాంటి లాభాలు చేకూరావని ముదిరాజులు పేర్కొంటున్నారు. గతంలో సైతం అధ్యక్షునిపైల విమర్శలు ఉన్నాయి ఇదే తీరును కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కొనసాగిస్తే అతనికి వ్యతిరేకంగా ఉన్న వర్గం మొత్తం ముకుమ్మడిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ కి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు నాయకులు తెలిపారు
అయినా ముది రాజులు చడి చప్పుడు చేయకుండా అతనికి సహకరిస్తూ ఉండడంతో అతను మరింత రెచ్చిపోయి తన ఇష్టం వచ్చిన రీతిగా కులాన్ని వాడుకుంటున్నాడని ముదిరాజులు పేర్కొంటున్నారు